![Patan movie : పఠాన్ మూవీ చూసేందుకు బంగ్లా నుంచి భారత్కు](https://static.v6velugu.com/uploads/2023/02/family-came-from-bangladesh_JDIZTBLRvm.jpg)
‘సినిమా పిచ్చోళ్లు’ అనే మాట వినే ఉంటారు. కొందరిని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. అభిమాన నటుడి సినిమా చూడటానికి థియేటర్లకి వెళ్తారు. కానీ, బంగ్లాదేశ్ కు చెందిన ఓ కుటుంబం ఏకంగా దేశాన్నే దాటింది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా చూసేందుకు ఆ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చింది.
ఢాకాకు చెందిన ఫిరోజ్ అహ్మద్, అతని భార్య రెహానా అన్సారీకి షారుఖ్ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. బంగ్లాదేశ్ లో పఠాన్ సినిమా విడుదలకు మరింత సమయం పడుతుందని తెలుసుకున్న ఆ కపుల్..తమ పిల్లలతో కలిసి త్రిపురలోని అగర్తలకు చేరుకుంది. రూపసి సినిమాస్ లో పఠాన్ సినిమా చూసింది. సినిమా తర్వాత ఆ కుటుంబ సభ్యులు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.