మోసం.. మోసం.. మోసం.. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. నమ్మకం అనే విలువైన ఆయుధంతో.. నిండా ముంచేస్తున్నారు వెధవలు. హైదరాబాద్ సిటీలోని కుత్బుల్లాపూర్ ఏరియాలో చిట్టీల పేరుతో 4 కోట్ల 70 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్ లో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న భార్యభర్తలు మేకా మునయ్య, నాగమణిలు.. పదేళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. మొదట్లో టైం టూ టైం డబ్బులు ఇచ్చేశారు. అంతేకాకుండా ఎక్కువ వడ్డీలు ఇస్తామంటూ డబ్బులు కూడా తీసుకునే వారు. నమ్మకం బాగా కుదిరిన తర్వాత.. 5 లక్షల చిట్టీలు మొదలుపెట్టారు. 40 మంది వరకు చిట్టీలు వేశారు. చిట్టీ పూర్తయ్యి ఐదు నెలలు అవుతున్నా.. ఇంత వరకు డబ్బులు చెల్లించలేదు. దీనికితోడు అధిక వడ్డీ వస్తుందని డబ్బులు ఇచ్చిన వాళ్లకు సైతం డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే మేకా మునయ్య, నాగమణిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు బాధితులు. ఈ క్రమంలోనే ఐపీ నోటీస్ పెట్టి పరార్ అయ్యారు. వెంకటేశ్వరనగర్ లోని ఉన్న సొంతింటిని సైతం అమ్మేసినట్లు చెబుతున్నారు బాధితులు. చిట్టీల పేరుతో 4 కోట్ల 70 లక్షల రూపాయలు రావాలని.. న్యాయం చేయాలంటూ బాధితులు అందరూ 2024, సెప్టెంబర్ 26వ తేదీన.. చిట్టీ యజమాని ఇంటి ఎదుట ఆందోళను దిగారు.
అందరం కష్టపడి పని చేసుకునేవారం అని.. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం చేతిలోని డబ్బులను చిట్టీలుగా వేశాం అని.. చిట్టీ టైం పూర్తయ్యినా.. మొత్తం డబ్బులు కట్టినా తిరిగి ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.