వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్ దేశం లాస్ట్..విపక్షాలపై మోడీ సెటైర్లు

యూపీఏ భేటీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో  జరిగిన తప్పులను తాము సరిదిద్దామని.. కొన్ని పార్టీలు తమ కుటుంబాల కోసమే పనిచేశాయని మండిపడ్డారు. వీర్ సావర్కర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించిన  ప్రధాని.. కొన్ని పార్టీలు  ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. సొంత లాభం కోసమే  విపక్షాలు భేటీ అవుతున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాల  నినాదం.ఫ్యామిలీ ఫస్ట్.. దేశంల లాస్ట్  అని సెటైర్ వేశారు. బీజేపీ హయాంలో గత 9 ఏళ్లలో దేశం గణనీయంగా పురోగమించిందని తెలిపారు. 

ALSO READ :హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు

బెంగళూరులో జరిగే యూపీఏ భేటీకి కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, డీఎంకే సహా 26 పార్టీలు హాజరవుతున్నాయి. యూపీఏ పేరును మార్చాలన్న ప్రతిపక్షాల డిమాండ్​పైనా డిస్కస్ చేస్తారు.  ఇక యూపీఏకు ధీటుగా ఢిల్లీలో  ఎన్డీయే భేటీ అవుతుంది. ఆపార్టీ అధ్యక్షతన జరిగే సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయి.  రాబోయే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు.