కాగజ్ నగర్, వెలుగు : కాగజ్ నగర్ మండలం నామనగర్ గ్రామానికి చెందిన మేడి సాయికుమార్(18) మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మృతుని కుటుంబీకులు, బంధువులు సోమవారం కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈనెల 11న గ్రామంలోని ఇత్యాల మొండి ఇంట్లో తన కొడుకు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించినప్పటికీ..
నేటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేదన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శంకరయ్య అక్కడకు చేరుకొని వారిని సముదాయించారు.