రాజస్థాన్ లో హత్యకు గురైన ఆలయ పూజారీ బాబూలాల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించడంలేదు. తమకు న్యాయం జరిగేదాకా అంత్యక్రియలు చేయబోమని బాబూలాల్ కుటుంబం తేల్చి చెప్పింది. పూజారి కుటుంబానికి 50 లక్షల పరిహారం, ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిందితులందరినీ అరెస్ట్ చేయాలని… గ్రామ పట్వారీ, నిందితులకు సహకరించిన పోలీసులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పూజారి కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బంధువులు.
కరోలీ జిల్లా ఎస్డీఎం ఓం ప్రకాష్ మీనా బాధిత కుటుంబానికి కలసి నిరసన ఆపాలని కోరారు. వారి డిమాండ్లను ప్రభుత్వ సీనియర్ అధికారులకు తెలియజేస్తామన్నారు. అతను చనిపోయి 2 రోజులు అవుతున్నందున చివరి కర్మ చేయాల్సిందిగా కోరారు.
Family of Priest Babulal has put forth their demands. We will let govt know about their demands through senior officers. We are requesting them to perform last rites of the body, as it's been 2 days since he died: Om Prakash Meena, SDM, Karauli, Rajasthan on Priest's last rites https://t.co/GlxRkKuTCe pic.twitter.com/l58np0TguH
— ANI (@ANI) October 10, 2020