చనిపోతూ పలువురికి ప్రాణం.. జీడిమెట్లలో ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

చనిపోతూ పలువురికి ప్రాణం.. జీడిమెట్లలో ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

జీడిమెట్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో యువకుడి బ్రేన్ డెడ్​కావడంతో అవయవదానానికి బాధిత కుటుంబం ముందుకొచ్చింది. కొంపల్లిలోని గంగా ఎన్​క్లేవ్ రాయల్​నెస్ట్ అపార్ట్​మెంట్​కు చెందిన ఉప్పు సుబ్బారావు సీఏగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు సాయి సుబ్రహ్మణ్యం(20) బీటెక్ లాస్టియర్ చదువుతున్నాడు. 

రోజు మాదిరిగానే ఈ నెల 4న వ్యాయామం చేయడానికి స్కూటీపై వెళ్తూ.. సేయింట్​ఆన్స్​స్కూల్ వద్ద మరో స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హెల్మెంట్ లేకపోవడంతో సాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడు.  దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, బ్రెన్​డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

దీంతో పుట్టెడు బాధను దిగమింగి తన కొడుకు అవయవాలను దానం చేయడానికి ఆ కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.