చనిపోయింది రాజే అన కన్ఫమ్ చేశారు నిందితుడి కుటుంబ సభ్యులు. వరంగల్ MGMకు చేరుకున్న రాజు కుటుంబ సభ్యులు... రాజ్ డెడ్ బాడీని గుర్తుపట్టారు. రాజు బావమరిది, అతని స్నేహితులు అది రాజు శవమే అని ఒప్పుకున్నారు. పోస్ట్ మార్టం లేట్ అవుతుందన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించారు మృతుడు కుటుంబ సభ్యులు. వరంగల్ ఏసీపీ ఆధ్వర్యంలో జనగామ పోలీసులు, రైల్వే పోలీసుల ద్వారా పోస్టుమార్టం రూంలోకి వెళ్లారు రాజు బంధువులు. ఒకరి జీవితం నాశనం చేసిండు కాబట్టి రాజు పోయిండని చెప్పారు రేపిస్ట్ రాజు అత్త. తన బిడ్డ జీవితం ఆగం చేసిండని ఆవేదన వ్యక్తం చేశారామె. తన బిడ్డకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రావొద్దన్నారు.