హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు మిస్టరీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం

హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు మిస్టరీ..  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం

హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమవ్వడం కలకలం రేపింది.. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు.. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్‌, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు మిస్సింగ్ అయినట్లు పోలీసులు తెలిపారు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

మహేశ్‌ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య అనే మహిళ గురువారం ఉదయం వెళ్లింది..మహేశ్‌, ఉమా.. వారి పిల్లలు రిషి, చైతు, శివన్‌ సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఆటో బుక్‌ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు...ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.