
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ లోని సిటీ న్యూరో సెంటర్హాస్పిటల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వారి వివరాల ప్రకారం.. వల్ల వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్జిల్లా ఘట్కేసర్మండలం ఔషాపూర్ కు చెందిన సందీప్ గౌడ్(37) శనివారం కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఉప్పల్సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. జీర్ణాశయానికి సంబంధించిన సమస్య ఉందని, చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు.
రూ.1.40 లక్షలు వసూలు చేశారు. ఆదివారం పేషెంట్ చనిపోయాడని చెప్పడంతో కుటుంబసభ్యులు కంగు తిన్నారు. హాస్పిటల్సిబ్బంది సందీప్గౌడ్మృతదేహాన్ని అంబులెన్స్ లో వేసి, తీసుకెళ్లండి అని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురై, అక్కడే బైఠాయించి, ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులతో మాట్లాడారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.