యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో శిశువు విక్రయం జరిగినట్లు ప్రచారం కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే 17 ఏండ్ల కూతురు ఉంది. కాగా సదరు మహిళకు గత నెలలో మరో పాప జన్మించింది. ఈ శిశువును ఓ జంటకు అమ్మినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీడబ్ల్యూసీ ఆఫీసర్లు సదరు మహిళతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
అయితే తాము చిన్నారిని అమ్మలేదని, పెంచుకునేందుకు తమ బంధువులకే ఇచ్చామని ఆ మహిళ కూతురు సీడబ్ల్యూసీ ఆఫీసర్లకు వివరించింది. దీంతో చిన్నారిని తీసుకెళ్లిన వారికి ఫోన్ చేయగా తాము ప్రస్తుతం అందుబాటులో లేమని, రెండు రోజుల్లో పాపను తీసుకొని వస్తామని ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు.