
హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గాజుల రామారాంలోని సహస్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి అనంతరం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33) దంపతులు కాగా వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఆత్మహత్యలకు గల కారణలను పోలీసులు ఆరా తీస్తు్న్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.