సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 57.30 శాతం పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. గడిచిన 12 రోజుల్లో 57.30 శాతం సర్వే పూర్తయింది. బుధవారం 1,32,656 కుటుంబాల వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు. గ్రేటర్​పరిధిలో మొత్తం 20,30,309 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 13,91,817 కుటుంబాల సర్వే పూర్తయింది.