కోటి ఇండ్లలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

  • 24 లేదా 25వ తేదీ కల్లా పూర్తవనున్న సర్వే ​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే  కోటి ఇండ్లలో పూర్తయింది.  నవంబర్ 6న మొదలైన సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 33 జిల్లాల్లోని దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు 100 శాతం పూర్తి కాగా.. నల్గొండ, మెదక్ లో 99.9%, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% శాతం సర్వే పూర్తయింది.  కామారెడ్డిలో 98.5%, మంచిర్యాల, అసిఫాబాద్,  నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. మొత్తం 1,01,40,767  కుటుంబాల వివరాలను  సేకరించి 87.1 శాతం సర్వేను ప్రభుత్వం పూర్తయింది. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నెమ్మదిగా సాగుతోంది.