నేషనల్​ హైవేపై సర్వే అప్లికేషన్ ​ఫామ్స్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: నేషనల్​హైవే 44పై మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు దాదాపు అర కిలోమీటరు మేర సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అప్లికేషన్ ​ఫారాలు దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అక్కడికి చేరుకుని వాటిని సేకరించారు.

మున్సిపల్ ఆఫీసుకు తరలించి కలెక్టర్​గౌతమ్ కు సమాచారం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్​అవి ఖాళీ ఫారాలని, మేడ్చల్​జిల్లాకు సంబంధించినవి కాదని తెలిపారు.