స్పీడ్ ​అందుకున్న సర్వే

  • నవంబర్​ 12న ( నాలుగో రోజు) 1.40 లక్షల కుటుంబాలు పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే సిటీలో సాఫీగా సాగుతోంది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లకు ప్రత్యేకంగా 10 మంది నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించడంతో నాలుగో రోజు సర్వే స్పీడ్ ​అందుకుంది. తొలిరోజు 12 వేలు, రెండోరోజు56 వేలు,  మూడోరోజు 88 వేల కుటుంబాల సర్వే జరగగా, మంగళవారం ఒక్కరోజే 1,40,224  కుటుంబాల సర్వేను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 2,98,364   కుటుంబాల సర్వే పూర్తయిందని, మరో 27లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం ఆయా సర్కిల్స్​లో నోడల్ అధికారులు సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి  ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ వివరాలను జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్, అధికారులు సేకరించారు.