యూట్యూబర్ ప్రాణం తీసిన రేసింగ్‌.. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

యూట్యూబర్ ప్రాణం తీసిన రేసింగ్‌.. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

న్యూయార్క్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ఆండ్రీ బీడిల్ ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం (నవంబర్ 6) స్ట్రీట్ రేసింగ్‌లో అతని ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక మెటల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదంలో కారు సైతం నుజ్జునుజ్జయ్యింది.

గంటకు 250 నుంచి 300 కి.మీ వేగం..

ఆండ్రీ బీడిల్ స్ట్రీట్ రేసింగ్‌ వీడియోల ద్వారానే పాపులర్ అయ్యాడు. తన BMW X5 కారులో గంటకు 250 నుంచి 300 కి.మీ వేగంతో దూసుకెళ్లే బీడిల్, ఎప్పటికప్పుడు ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేవాడు. తద్వారా అభిమానులకు బాగా చేరువయ్యాడు. అతనికి 59,500 మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 250,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఈ విషాదకర ఘటనకు కొన్ని గంటల ముందు బీడిల్యూట్యూబ్ ఛానెల్‌లో 20 నిమిషాల వీడియో పోస్ట్ చేశారు. అందులో అతను స్నేహితులతో కలిసి తన BMWలో కొన్ని సర్దుబాట్లు చేస్తున్నాడు. ఇదే అతని చివరి వీడియో అవుతుందని వారు ఊహించలేదు.