మోహన్ లాల్ నిజంగానే ఆర్మీ ఆఫీసరా.. ర్యాంక్ ఏంటీ.. సైన్యంలో ఎప్పుడు చేరారు..?

ప్రముఖ సినీనటుడుమోహన్ లాల్ వయనాడ్ లో ఫ్లడ్స్, ల్యాండ్స్ స్లైడ్స్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం ఆగస్టు3, 2024  వయనాడ్ లో పర్యటించిన మోహన్ లాల్..బాధితులను ఆదుకునేందుకు రూ.3 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. వయనాడ్ పరిధిలోని మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న మోహన్ లాల్, అధికారులతో కొద్దిసేపుచర్చించి కొండచరియలు విరిగిన పడిన మండలానికి వెళ్లారు. 

పర్యటనలో సమయంలో మోహన్ లాల్ ఆర్మీ డ్రెస్ లో అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. మోహన్ లాల్ నిజంగానే ఆర్మీ ఆఫీసరా అనే డౌట్ వస్తుంది. నిజమే మోహన్ లాల్ ఆర్మీ ఆఫీసరే.. మన భారత సైన్యంలో పదాతి దళంలో కీలకంగా పనిచేస్తున్నారు. 

2009లో మోహన్ లాల్ కు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేశారు. వయనాడ్ బాధిత ప్రాంతాలకు ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వెళ్లారు. బాధితులను పరామర్శించారు.భారత సైన్యంలోని122 పదాతిదళ బెటాలియన్ (TA) భాగంగా తాను లెఫ్టినెంట్ కల్నర్ హోదాలో విపత్తుతో దెబ్బతిన్న ప్రాంతాన్ని సహాయక చర్యల్లో పాల్గొన్నారు మోహన్ లాల్.

టెరిటోరియల్ ఆర్మీ ( TA ) అనేది భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్-టైమ్ వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్ . ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు , నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు, వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్‌లను కలిగి ఉంటారు. విధుల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా పనిచేయడం, ప్రకృతి వైపరీత్యాలు, అవసరమైన సేవల నిర్వహణలో పౌరులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి యూనిట్లను టెరిటోరియల్ ఆర్మీ అందిస్తుంది.