గెలుపోటములను స్పోర్టివ్​గా తీసుకోవాలి : మీలా మహదేవ్ 

సూర్యాపేట, వెలుగు : గెలుపోటములను క్రీడాకారులు స్పోర్టివ్​గా తీసుకోవాలని  ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎం‌డీ మీలా మహదేవ్ అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ మీట్–2024ను ఆయన ప్రారంభించారు.

అనంతరం విజేతలకు మెడల్స్, షీల్డ్ లు అందజేసి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. అనంతరం  అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన సుమారు 650 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు.

అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మల్లేశ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఆజాం బాబా, హనుమంతరావు, కిరణ్ కుమార్, శ్రీనివాస్, యాదయ్య, మైసయ్య, సైదులు, వెంకటేశ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.