పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు

వరంగల్: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కందికొండ స్వగ్రామం వరంగల్ జిల్లా, నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఆయన కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. మొదట హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో కందికొండ అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ గ్రామస్థులు, బంధువుల కోరికతో సొంతూర్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. రాత్రి కందికొండ భౌతికకాయం నాగుర్లపల్లికి చేరుకుంది. కందికొండకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు నర్సంపేట్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కందికొండకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తోపాటు పలువురు కవులు, కళాకారులు నివాళులు అర్పించారు. కందికొండ కుమారుడికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పిస్తామని రసమయి హామీ ఇచ్చారు. 

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు

‘కందికొండ కుమారుడికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పిస్తాం. ఈ విషయంపై వెంటనే సీఎం కేసీఆర్, కేటీఆర్ తో మాట్లాడతాం. పాట గురించి తప్పితే.. పైసల గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి కందికొండ. ఆయన పాట వెంట పరిగెత్తాడు తప్పితే ఆస్తులు కూడబెట్టుకోలేదు. పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన రాసిన పాటలు ఊపిరిపోశాయి. తండ్రి పేరు నిలిపేలా కందికొండ కొడుకు మంచి కీబోర్డు ప్లేయర్ అవుతాడు. కందికొండ మరణం తెలంగాణ కళారంగానికి, సాహిత్య లోకానికి తీరని లోటు’ అని రసమయి బాలకిషన్ అన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

డేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్

కమల్ హాసన్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఉబర్​ ఇండియా సీఈవో @ క్యాబ్ డ్రైవర్