హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
‘మా విడాకులు’, ‘పెళ్లి వారమండి’, ‘దిల్ పసంద్’, ‘వింధ్యా విహారి’ తదితర వెబ్ సిరీస్ లు ప్రసాద్ బెహరాకు మంచి పేరు తీసుకొచ్చాయి. వెబ్ సిరీస్ల్లో వచ్చిన గుర్తింపుతో ఈ మధ్యే కొన్ని చిన్న సినిమాల్లో కూడా ఇతనికి యాక్టింగ్ అవకాశాలొచ్చాయి. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో మంచి రోల్ దక్కింది.
ALSO READ | Allu Aravind: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్.. అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం చెప్పేశారు..
ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో అవకాశాలు దక్కుతున్న ఈ సమయంలో ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం, అదీ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం అతని కెరీర్కు పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు. తెలుగులో యూట్యూబర్లు లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. యూట్యూబర్ హర్ష సాయి, షణ్ముక్ జశ్వంత్, పక్కింటి కుర్రాడు ‘చందు సాయి’ ఇలా లైంగిక వేధింపుల కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జీవితాలను ఆగం చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య చాలానే వెలుగుచూశాయి.