కోహ్లీ అభిమాని షారుఖ్‌కి సూటి ప్రశ్న.. సూపర్ స్టార్ ఏం చెప్పాడంటే..?

మన దేశంలో క్రికెట్, సినిమాకి ఎంత ఫాలోయింగ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటే.. సినిమాల్లో షారుక్ ఖాన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నా.. ఐపీఎల్  సందర్భంగా కోహ్లీ,షారుక్ అభిమానులు మా వాడు గొప్ప అంటే మావాడు తోపు అని గొడవపడ్డారు. అప్పట్లో వీరి గొడవ సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా.. తాజాగా కోహ్లీ అభిమాని షారుఖ్ ని ఒక ప్రశ్న వేసాడు. 

 #AskSRKలో భాగంగా కోహ్లీ ఫ్యాన్.. షారుఖ్ సర్ కోహ్లీ గురించి ఏమైనా చెప్పండి అన్నాడు. అభిమాని ప్రశ్నకు స్పందించిన సూపర్ స్టార్ "చాలా సంతోషంతో కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. అతను నా స్వంత వ్యక్తి. విరాట్ క్షేమం కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. అతను నాకు అల్లుడు లాంటివాడు".అని కోహ్లీపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కాగా కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 'రబ్ నే బనా దీ జోడీ' ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో షారుఖ్ హీరో. 

ALSO READ: రోహిత్ శర్మని చూసి నేర్చుకో.. తమీమ్‌పై బంగ్లా కెప్టెన్ ఫైర్
 

ప్రస్తుతం షారుక్ తాజాగా నటించిన జవాన్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతుంది.ఇప్పటికే దాదాపు 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. మరోవైపు కోహ్లీ వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు.