![తమన్నా చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.. చేయి పట్టేసుకున్నాడు కానీ!](https://static.v6velugu.com/uploads/2023/08/Fan-Breaches-Security,-Grabs-Tamannaah-Bhatia's-Hand-At-Kerala-Event_DTtmLzanby.jpg)
మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎక్కడ చూసినా ఈ అమ్మడు పేరే వినిపిస్తోంది. ఆ మధ్య విజయ్ వర్మతో పెళ్లి విషయంతో బాగా ట్రెండ్ అయినా ఈ బ్యూటీ.. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలోని కావాలయ్యా సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేస్తోంది. జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక తాజాగా తమన్నా కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఆ విషయం తెలుసుకున్న తమన్నా అభిమానులు భారీ సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడకు వచ్చిన అభిమానులకు హాయ్ చెబుతూ వెళ్తుండగా.. హఠాత్తుగా ఓ అభిమాని వచ్చి తమన్నా చేయి పట్టేసుకున్నాడు. వెంటనే బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకు లాగేసారు. కానీ ఆ అభిమాని ఉత్సాహాన్ని గమనించిన తమన్నా.. ఆ బౌన్సర్లకు నచ్చచెప్పి అభిమాని కి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓ సెల్ఫీ కూడా దిగింది. దీంతో ఆ అభిమాని ఫుల్ ఖుషీ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆవుతోంది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మిల్కీ బ్యూటీ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. తన అభిమాని అంత వేగంగా తనవైపుకు వచ్చినా ఏమాత్రం భయపడకుండా చాలా కూల్ గా ఆ సిచువేషన్ ను హేండిల్ చేసింది. అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా సేల్ఫీ కూడా ఇచ్చి పంపించింది. దీంతో తమన్నా చేసిన ఈ పనికి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.