KKR vs RCB: పోలీస్ వాహనంలో డై హార్డ్ ఫ్యాన్.. కోహ్లీ పాదాలు తాకిన అభిమాని అరెస్ట్

KKR vs RCB: పోలీస్ వాహనంలో డై హార్డ్ ఫ్యాన్.. కోహ్లీ పాదాలు తాకిన అభిమాని అరెస్ట్

ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. కానీ, డై హార్డ్ ఫ్యాన్స్ కొంతమందే ఉంటారు. ఇక ఆ అభిమానులు స్టార్లకోసం చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ కోసం ఒక అభిమాని చేసిన పని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో అనూహ్య  సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ వీరాభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చి విరాట్ పాదాల మీద పడ్డాడు. ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకొని వెళ్లారు.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ పెట్టిన రూల్స్ అతను అతిక్రమించినందుకు గాను పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ అభిమానిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీ కాళ్ళ మీద పడడం ఫ్యాన్స్ కు ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు ఫ్యాన్స్ సెక్యూరిటీని ధాటి మరీ కోహ్లీ కోసం గ్రౌండ్ లోకి వచ్చారు. అయితే ఈ సారి అభిమానిని అరెస్ట్ చేయడం షాకింగ్ గా మారింది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.. ఐపీఎల్‌‌–18లో బోణీ చేసింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ (36 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 59 నాటౌట్‌‌), ఫిల్‌‌ సాల్ట్‌‌ (31 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 56) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ తొలి మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 7 వికెట్ల తేడాతో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌పై నెగ్గింది. టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 16.2 ఓవర్లలో177/3 స్కోరు చేసి గెలిచింది. క్రునాల్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.