అభిమాని లేఖకు ధోని ఫిదా..రిప్లై ఏమిచ్చాడో తెలుసా

అభిమాని లేఖకు ధోని ఫిదా..రిప్లై ఏమిచ్చాడో తెలుసా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఓ అభిమాని లేఖ రాశాడు. ధోని అంటే ఎంత ఇష్టమో ఆ లేఖలో అతను వివరించాడు. ఎక్కడైతే చీకట్లు ఉంటాయో అక్కడ వెలుగులు నింపావు.  వెలుగులు ఉన్న చోట  వాటిని మరింత ప్రకాశింపజేశావంటూ లేఖను మొదలు పెట్టాడు.  క్రికెటర్ గానే కాకుండా , ఒక పర్సన్ గానూ నన్ను ప్రభావితం చేశావంటూ ధోనిని ఆకాశానికెత్తాడు. వికెట్ కీపర్ గా, బ్యాట్సమన్ గా ధోని తన జీవితంలో భాగమయ్యాడని లేఖలో పేర్కొన్నాడు.

 

 ధోని విజయాల వెనకున్న శ్రమను చూసిన తర్వాత నేను భక్తుడినయ్యానంటూ MSDపై ఫ్యాన్ ప్రశంసలు కురిపించాడు. అభిమాని  లేఖకు  ధోని ఫిదా అయ్యాడు. బాగా రాశావంటూ మెచ్చుకున్నాడు.  శుభాకాంక్షలు తెలిపి..సంతకం చేశాడు. ధోనికి అభిమాని రాసిన లేఖను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రేమ్ గా మలిచింది. ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. 

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్

కేటీఆర్ సైకోలా మాట్లాడుతుండు....