ENG vs SL 2024: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: డ్రింక్ తాగుతూనే సింగిల్ హ్యాండ్ క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచ్ లు అందుకున్నప్పుడు పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఊహకందని క్యాచ్ లతో మైదానంలో ఆటగాళ్లు ఎన్నో సార్లు ఔరా అనిపించారు. అయితే ఒక క్రికెట్ ప్రేక్షకుడు అద్భుతమైన క్యాచ్ తో అందరిని విస్తు గొలిపాడు. సింగిల్ హ్యాండ్ తో స్టయిల్ గా క్యాచ్ అందుకొని హైలెట్ గా నిలిచాడు. శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ వుడ్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అసిత ఫెర్నాండో  షార్ట్ బాల్ విసిరాడు. 

ఈ బంతిని వుడ్ డీప్ మిడ్ వికెట్ లో ఉన్న స్టాండ్స్ లోకి పంపించాడు. సిక్సర్ గా వెళ్లిన ఈ బంతిని ఒక అభిమాని సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టాడు. అదే సమయంలో అతని చేతిలో నాలుగు బీర్ గ్లాస్ లు ఉండడం విశేషం. ఒక చేత్తో బీరు గ్లాసులతో డ్రింక్ తాగుతూ మరో చేత్తో క్యాచ్ పట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెంట్రీలతో పాటు డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కోచ్ కాలింగ్ వుడ్ ఏ ఈ క్యాచ్ ను చూసి షాకయ్యారు. నెటిజన్స్ ఇదే బెస్ట్ క్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ | Shikhar Dhawan: బాధతోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. ధావన్ కెరీర్‌లో హైలెట్స్ ఇవే

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.  దీంతో లక్నక జట్టు 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మెండీస్ (56), చండీమల్ (20) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు శ్రీలంక 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 122 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.