17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్న జూ.ఎన్టీఆర్

17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్న జూ.ఎన్టీఆర్
  • ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో హయ్యెస్ట్ బిడ్ జూనియర్ ఎన్టీఆర్ దే..

హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. 17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబరు దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇవాళ జరిగిన అన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఇదే హయ్యెస్టు బిడ్. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆర్టీయే అధికారులకు మొత్తం 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి. నెంబర్ల వారీగా వేలం.. పలికిన ధర.. దక్కించుకున్న యజమాని వివరాలు.. 
నెంబర్: TS 09 FT టీ 0001 .. బిడ్ మొత్తం.. రూ.7,01,000 యజమాని పేరు: లహరి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్
నెంబర్:  TS 09 FT 0009 బిడ్ మొత్తం: రూ 3,75,999.. యజమాని పేరు: రతన్ నల్లా 

మరిన్ని వార్తల కోసం..

మాంస ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండింగ్

సూసైడ్‌ నోట్‌: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

కార్వీపై వందల కోట్ల రుణాల ఎగవేత