- 10.47లక్షలు పలికిన ‘TG 09 E 0009’
- ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏకు కాసుల వర్షం
- ఒక్కరోజే రూ.38లక్షల76వేల996 ఆదాయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు : ఫ్యాన్సీ వెహికల్నంబర్లకు క్రేజ్ తగ్గట్లేదు. లక్షలు ఖర్చయినా.. కోరుకున్న నంబర్‌ను దక్కించుకునేందుకు జనం పోటీ పడుతున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏ ఆఫీసులో పలు ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించగా, ప్రభుత్వానికి రూ.38లక్షల76వేల996 ఆదాయం సమకూరింది. ‘టీజీ 09 ఈ 0009’ నంబర్‌ను వెంకటేశ్‌గౌడ్ ఐజా అనే వాహనదారుడు రూ.10లక్షల46వేల999కు దక్కించుకున్నాడు.
‘టీజీ 09 డీ 9999’ నంబర్ ను ఎటర్నల్ఎవెన్యూస్అండ్ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ప్రైవేట్ కంపెనీవారు రూ.6లక్షల26వేలకు దక్కించుకున్నారు. ఇక ‘టీజీ 09 ఈ 0001’ను శ్రీనివాస్‌రెడ్డి పెరటి అనే వ్యక్తి రూ.4లక్ష69వేల900కు, ‘టీజీ 09 ఈ 0005’ను కారా కన్సీల్ ప్రైవేట్లిమిటెడ్సంస్థ వారు రూ.2లక్షల43వేల001కు, ‘టీజీ 09 ఈ 0006’ను గోయజ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్‌సంస్థ వారు
రూ.2లక్షల25వేల117కు, ‘టీజీ 09 ఈ 0007’ను ఎస్.కె. కార్ లాంజ్ సంస్థ వారు రూ.లక్షా58వేల003కు, ‘టీజీ 09 ఈ 0003’ను వెర్ట్లైన్మెరీన్బంకర్స్ప్రైవేట్లిమిటెడ్ సంస్థ వారు రూ.లక్షా11వేలకు, ‘టీజీ 09 ఈ 0027’ను న్యూలాండ్లేబొరేటరీస్లిమిటెడ్సంస్థ వారు రూ.లక్షా9వేలకు, ‘టీజీ 09 ఈ 0019’ను సితార ఎంటర్టైన్మెంట్స్సంస్థ వారు రూ.1,00,019 దక్కించుకున్నారని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు.