వణుకుతున్న ‘పూరీ’ : తీరం దాటిన Fani తుఫాన్

వణుకుతున్న ‘పూరీ’ : తీరం దాటిన Fani తుఫాన్

పూరీ దగ్గర్లో తీరం దాటిన FANI తుఫాన్

ఒడిశాలో వేగంగా సహాయక చర్యలు

బంగ్లాదేశ్ వైపు తుఫాను వెళ్లే అవకాశం.. ఆలోపే బలహీనపడనున్న FANI

పూరీ ప్రాంతంలో గంటకు 220 కి.మీ. వేగంతో గాలులు

ఒడిశాలోని పూరీ దగ్గర్లో FANI తుఫాన్ తీరం దాటింది. పూరీకి దక్షిణంగా తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ తీరం తాకడంతో… ఇక నుంచి బలహీన పడనుంది.

ఒడిశా బాలాసోర్ దగ్గర్లో మళ్లీ సముద్రంలోకి FANI వచ్చే చాన్స్ ఉందనీ… అలాగే ప్రయాణించి… కోల్ కతాను దాటి బంగ్లాదేశ్ వైపు ఈ తుఫాన్ వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఐతే.. బంగ్లాదేశ్ వెళ్లేలోపే FANI తుఫాన్ బలహీన పడుతుందని చెబుతున్నారు.

తుఫాను సాయం కావాల్సిన వారికోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటుచేసింది. 1938 నంబర్ కు కాల్ చేసి సహాయం కోరవచ్చని సూచించింది.

తుఫాన్ కారణంగా వణుకుతున్న పూరీ

FANI తుఫాన్ కారణంగా… ప్రఖ్యాత పూరీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ప్రచండ గాలులు వీస్తున్నాయి. భారీ వర్షం పడుతోంది. అత్యంత బలమైన గాలులకు… అక్కడ ప్రళయ వాతావరణం కనిపిస్తోంది.

తుఫాన్ తీరం దాటిన ఏరియాకు 20 కిలోమీటర్ల పరిధిలో… వేలాది చెట్లు నేలకూలాయి. కరెంట్ పోల్స్, హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీవర్షాలకు… పలు ప్రాంతాలను వరదనీరు ముంచేసింది.

ఒడిశా ప్రభుత్వ తుఫాను సహాయక బృందాలకు, పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తోడయ్యాయి. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించి.. సురక్షిత శిబిరాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు 11 లక్షల మందికిపైగా చేర్చారు. నాలుగు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వెస్ట్ బెంగాల్ లోనూ FANI బీభత్సం

FANI ఎఫెక్ట్ తో వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తుఫాన్ సహాయక చర్యలను అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

 

పూరీ కోస్తా తీరంలో Fani తుఫాను ప్రచండ గాలుల బీభత్సం