
ఐపీఎల్ లో ప్రతీ సెకనూ ఇంపార్టెంటే.. ప్రతి నిర్ణయం గేమ్ ను మార్చేదే. రిజల్ట్స్ నెగెటివ్ ఉండవచ్చు.. పాజిటివ్ ఉండవచ్చు. శుక్రవారం (ఏప్రిల్ 4) ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం టీమ్ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిపోయారు. టీమ్ తీసుకున్న నిర్ణయం ‘చెత్త నిర్ణయం’ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫ్యాన్సే కాదు.. మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా ముంబై డెసిషన్ దారుణం అని.. అందుకు మూల్యం చెల్లించుకుందని అంటున్నారు. శుక్రవారం మ్యాచ్ లో ఛేజింగ్ లో తిలక్ వర్మను సడెన్ గా రిటైర్డ్ హార్ట్ కావాల్సిందిగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
MI vs LSG మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మూడో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది. ఐదో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోర్ మంచి భాగస్వామ్యమే క్రియేట్ చేశాడు. సూర్య కుమార్ భారీ షాట్స్ ఆడుతుంటే, తిలక్ వర్మ సూర్యకి స్ట్రయికింగ్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అయితే, 17వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటైనా.. స్లోగానే ఆడుతుండటంతో ముంబై టీమ్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 19వ ఓవర్ ఐదో బాల్ కు హార్దిక్ సింగ్ తీసి ఇచ్చాడు. ఆఖరి బంతికి తిలక్ స్ట్రయికి లోకి వచ్చిన తిలక్ ఆ బాల్‌ను ఎదుర్కోకుండా సడెన్ గా రిటైర్డ్ అవుట్‌గా వెళ్లిపోయాడు. అంటే అవుట్ కాకుండానే క్రీజ్ వదిలిపెట్టి, తర్వాత బ్యాటర్‌కు అవకాశం ఇచ్చాడు.
🚨 A RARE SCENE IN CRICKET. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025
- Tilak Varma who came in as an impact player, retired out before the final over. 🤯 pic.twitter.com/oqg6JwRNiV
తిలక్ తర్వాత సాంట్నర్‌ను బ్యాటింగ్‌కు వచ్చినా ప్రభావం చూపలేకపోయాడు. ఏడు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ ను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. తిలక్ స్థానంలో వచ్చిన శాన్‌ట్నర్ ఆఖరి బంతికి రెండు పరుగులు మాత్రమే తీశాడు. చివరి ఓవర్‌లో స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ .. ఒక సిక్సర్‌తో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ముంబై తీసుకున్న షాకింగ్ డెసిషన్ కారణంగానే ఓడిపోయిందని, చెత్త నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. తిలక్ వర్మ ఉండుంటే చివరి ఓవర్లో పుంజుకునేవాడేమో అని అంటున్నారు. భారీ షాట్లు ఆడటంలో తిలక్ వర్మకు పెట్టింది పేరు. లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కు బౌండరీ బాదేవాడేమో? లేక ఆఖరి ఓవర్‌లో సిక్సర్లు కొట్టేవాడేమో? కదా అని టీమిండియా మాజీలు అంటున్నారు. ముంబై తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హార్దిక్కు ఒక న్యాయం.. తిలక్కు ఒక న్యాయమా..?
తిలక్ వర్మను రిటైర్డ్ హార్ట్ తో పెవిలయన్ పంపడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ఇలా స్లో రన్ రేట్ చేసి చికాకు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. భారీ షాట్లు ఆడేందుకు ఆ మ్యాచ్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ హార్దిక్ ను రిటైర్డ్ అవుట్ చేయలేదు. కానీ తిలక్ ను రిటైర్డ్ అవుట్ గా వెనకు పంపించారు. హార్దిక్ కు ఒక న్యాయం.. తిలక్ వర్మకు ఒక న్యాయమా అని విమర్శిస్తున్నారు. రిటైర్డ్ అవుట్ చేయడం వల్ల రాబోయే మ్యాచ్ ల్లో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, టెస్టు ప్లేయర్ హనుమ విహారీలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఆ నిర్ణయం హర్దిక్ ది కాదు.. నాదే: కోచ్ జయవర్ధనే
తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేయడం నిర్ణయం వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడనే విమర్శలు వస్తుండటంతో.. ముంబై మెంటర్ మహేళా జయవర్ధనే వివరణ ఇచ్చాడు. ఆ నిర్ణయం ప్యాండ్యాది కాదు.. తనదేనని ప్రకటించాడు. భారీ షాట్లు ఆడటంలో ఇబ్బందులు పడుతున్నాడనే వెనకకు రప్పించామని ఈ సందర్భంగా చెప్పాడు.
తిలక్ రిటైర్డ్ అవుట్ వెనుక కారణం అదే: పాండ్య
తిలక్ రిటైర్డ్ అవుట్ పై కెప్టెన్ హార్దిక పాండ్యా సంమర్ధించుకున్నాడు. గెలుపుకోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజమని అన్నాడు. ‘‘ఆ సమయంలో మాకు కొన్ని హిట్టింగ్ షాట్స్ కావాలి. తిలక్ భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. అందుకే రిటైర్డ్ అవుటు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ కొన్ని నిర్ణయాలు సక్సెస్ అవ్వొచ్చు కాకపోవచ్చు.. ఏది చేసినా గెలుపు కోసమే’’నని వివరణ ఇచ్చాడు పాండ్యా