టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయంపై పాండ్య స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ కూడా చేసాడు. భారత జట్టుతో సగటు క్రికెట్ అభిమాని పాండ్య భారత జట్టుకు దూరం కావడంతో అయ్యో అనుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం హార్దిక్ ను టార్గెట్ చేశారు. ఈ ఆల్ రౌండర్ మీద ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండు నెలలపాటు జరిగే ఐపీఎల్ కు నీకు ఎలాంటి గాయాలు కావు. జాతీయ జట్టుకు ఆడాలంటే మాత్రం నీ చెత్త బుద్ధి చూపిస్తావు. అని ఒక నెటిజన్ మండిపడితే.. గాయం ఇబ్బందిపెడుతున్న దేశం కోసం కేన్ విలియంసన్ అంకితభావాన్ని చూసి నేర్చుకో అని మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఇక మరో నెటిజన్ క్యాన్సర్ ఉందని తెలిసినా యువరాజ్ లెక్క చేయలేదు. నువ్వు మాత్రం ఆడే సత్తా ఉన్నా ఆడలేకపోయావు అని కామెంట్ చేసాడు. ఇలా ఐపీఎల్ కు ఇచ్చిన ప్రాధాన్యత దేశానికి ఇవ్వట్లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఈ వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచ్ లు ఆడిన హార్దిక్.. బంగ్లాపై ఆడిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.అయితే చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఆ తర్వాత వరుసగా న్యూజీలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ లకు దూరమయ్యాడు. బెంగళూరు NCA లో తీవ్రంగా శ్రమించినప్పటికీ హార్దిక్ కు మరింతగా విశ్రాంతి కావాలని వైద్య బృందం తెలిపింది. దీంతో హార్దిక్ లేకుండానే టీమిండియా తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోతుంది. అయితే పాండ్య స్థానంలో ప్రసిద్ కృష్ణను సెలక్ట్ చేశారు.