ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్కు అర్ష్దీప్ సింగ్.. బుమ్రా ఫ్యాన్స్ సీరియస్

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్కు అర్ష్దీప్ సింగ్.. బుమ్రా ఫ్యాన్స్ సీరియస్

ఐసీసీ 2024 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ లిస్టును విడుదల చేసింది. ఇండియా నుంచి అర్ష్ దీప్ సింగ్ నామినేషన్స్ లిస్టులో ఉన్నాడు. టీ20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్ లో ఇండియా నుంచి యంగ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఉండటంపై క్రికెట్ ఫ్యా్న్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఐసీసీ విడుదల చేసిన నామినేషన్స్ లిస్టులో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా, పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజమ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్ తో పాటు ఇండియా నుంచి అర్ష్ దీప్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఈ ప్లేయర్స్ వాళ్ల టీమ్స్ కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంలో భాగంగా నామినేషన్స్  కు ఎంపిక అయ్యారని ఐసీసీ ప్రకటించింది. 

అర్ష్ దీప్ సింగ్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్

అర్ష్ దీప్ సింగ్ 2024లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ఐసీసీ తెలిపింది. టీ20లో ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఎంత ఒత్తిడిలోనైనా సునాయాసంగా బౌలింగ్ చేస్తూ కీలక సమయాలలో వికెట్లు తీయడంతో ట్యాలెంటెడ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో కేవలం 18 మ్యాచ్ లలో 36 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 

ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ లో ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అర్ష్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యమైన క్వింటన్ డీకాక్, ఐడెన్ మార్క్ రమ్ వికెట్లు తీయడమే కాకుండా 19వ ఓవర్ లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి రిక్వైర్ డ్ రన్ రేట్ ను అమాంతం పెంచేశాడు. ఒకవైపు బుమ్రా, మరోవైపు అర్ష్ దీప్ సహకారంతో ఇండియా సెకండ్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ కొట్టగలిగింది. 

బుమ్రా ఫ్యాన్స్ ఆగ్రహం.. విమర్శలకు దారితీసిన నామినేషన్స్ లిస్టు..

నామినేషన్స్ లిస్టులో పాక్ బ్యాటర్ బాబర్ అజమ్ పేరు ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్ మంచి టీ20 ప్లేయర్ అయినప్పటికీ.. గత కొన్నాల్లుగా స్కోరింగ్ చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతనికి ప్లేస్ దక్కింది. అదే టైమ్ లో టీ20 లో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతో, కెప్టెన్సీతో ఆకట్టుకున్నా పేరు లేదని విమర్శిస్తున్నారు.

ALSO READ | IND vs AUS: టీమిండియా గెలిచేనా..! MCGలో మునపటి ఛేజింగ్ రికార్డులేంటి..?

ఇక బుమ్రా ప్రతి మ్యాచ్ లో కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టౌర్నమెంట్ గా నిలిచాడు. అయినా బుమ్రా పేరు లేదని ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏమాత్రం ప్రభావం చూపని ప్లేయర్లను లిస్టులో ఇచ్చి బుమ్రాను సెలెక్ట్ చేయకపోవడంపై ఫ్యాన్స్, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియా నుంచి కనీసం అర్ష్ దీప్ ను సెలెక్ట్ చేయడం సంతోషించదగిన విషయమని అంటున్నారు.