
విజయవాడ: భారీ అంచనాలతో RRR మూవీ ఈ రోజు రిలీజైంది. దీంతో చాలా కాలం తర్వాత థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ లో కొన్ని సాంకేతిక కారణాలతో RRR షో రద్దయింది. దీంతో అభిమానులు రచ్చ రచ్చ చేశారు. సినిమా ఆగిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. స్క్రీన్ ముందు ఏర్పాటు చేసిన మేకుల ఫెన్సింగ్ ను తీసేశారు. తమ అభిమాన హీరోల పేర్లతో నినాదాలు చేస్తూ థియేటర్లో గోల గోల చేశారు.
Andhra Pradesh | People removed nail fencing, smashed windows after the screening of the #RRRMovie halted due to technical reasons at Annapurna Theatre in Vijayawada. pic.twitter.com/HauZEslPNM
— ANI (@ANI) March 25, 2022
మరిన్ని వార్తల కోసం: