టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి గ్రౌండ్ లో అభిమానులు భారీగా తరలి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది. విరాట్ ఏ దేశంలో ఆడినా అక్కడ ఫ్యాన్స్ అతన్ని చూడడానికి రెడీగా ఉంటారు. అయితే అతను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అభిమానులు ఆస్ట్రేలియాలో ఆసక్తి చూపిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఈ నెల 24 నుంచి తొలి టెస్ట్ ఆడుతుంది. పెర్త్ వేదికగా ఈ టెస్ట్ జరగనుంది.
ఈ సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. విరాట్ కోహ్లీ అందరికంటే ముందుగా ఆసీస్ చేరుకున్నాడు. ఈ సిరీస్ కోసం ఫామ్ లోకి రావాలని చూస్తున్న కోహ్లీ.. ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు. గురువారం (నవంబర్ 14) అతను ప్రాక్టీస్ చేస్తుండగా అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ ని చూడడానికి చెట్టు పైకి ఎక్కారు. దూరం నుంచి కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ వీరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. పేలవ ఫామ్ లో ఉన్న విరాట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశం కోరుకుంటుంది. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఘోరంగా ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన 5 ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు అనుభవజ్ఞుడు కోహ్లీ ఫామ్ లోకి రాకపోతే భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.
Virat Kohli sending thunderbolts through the Perth nets and look at the crowds - they'd climb Mount Everest just to watch Kohli shadow practice!
— SportsCafe (@IndiaSportscafe) November 14, 2024
ABSOLUTE SCENES AT THE WACA!pic.twitter.com/F05tAeSVl5