ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్హైదరాబాద్, రాజస్థాన్రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు ఫ్యాన్స్ పోటెత్తారు. వరుసగా నాలుగో మ్యాచ్‌కూ స్టేడియం కిక్కిరిసింది. హైదరాబాద్ టీమ్‌లోని తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి బ్యాట్‌తో రఫ్ఫాడించాడు. 8 సిక్సులు, 3 ఫోర్లతో 42 బంతుల్లో 76 కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
నితీశ్ ఆడుతున్నంతసేపు ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం హోరెత్తింది. పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. రెండు వరుస ఓటముల తర్వాత, హైదరాబాద్ విజయం సాధించడంతో తెలుగు ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. గురువారం మొత్తం 36,118 మంది ఫ్యాన్స్హాజరయ్యారు. ఈ సీజన్లో ఇదే హయ్యస్ట్. – వెలుగు, హైదరాబాద్