IND vs NZ 2nd Test: ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకొని రండి.. భారత ఫ్యాన్స్ డిమాండ్

పూణే టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రీజ్ లో ఒక్కరు కుదురుకోలేకపోతున్నారు. అందరూ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. అంతకముందు బెంగళూరు టెస్టులోనూ భారత్ 46 పరుగులకు ఆలౌటైంది.

యువ క్రికెటర్లలో అద్భుత నైపుణ్యమున్నా అనుభవం లేకపోవడం వారికి మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ భారత వెటరన్ ప్లేయర్లు.. టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా టీమిండియాలోకి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. రహానే, పుజారా జట్టులో ఉంటే భారత్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. వీరి స్థానాలను ఎవరూ పూరించలేరని  ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

వీరిద్దరూ టీమిండియాలో కనిపించడం కష్టంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించి ద్రావిడ్, లక్ష్మణ్ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడితే.. ఐదో స్థానంలో రహానే నిలకడగా రాణించాడు. బాగా టెస్టుల్లో వీరి స్థానం సుస్థిరం చేసుకున్నారు. 

ALSO READ | IND vs NZ 2nd Test: డేంజర్ జోన్‌లో భారత్.. 300 పరుగులు దాటిన న్యూజిలాండ్ ఆధిక్యం

పుజారా, రహానే లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. వీరు కంబ్యాక్ ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. చివరి రంజీ సీజన్ లో అద్భుతంగా రాణించినా పుజారాకు నిరాశ తప్పలేదు. మరోవైపు ఇంగ్లాండ్ కౌంటీల్లో రహానే అదరగొడుతున్న పట్టించుకోవడం లేదు. వయసు 35 కావడంతో వీరి దారులు మూసుకుపోయినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇటీవలే వీరిని దేశవాళీ క్రికెట్ లో ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు.    

 తాజాగా సెలక్టర్లు వీరిని దులీప్ ట్రోఫీకి సెలక్ట్ చేయకపోవడంతో వీరి భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారింది. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి వీరు ఎంపిక కాకపోవడంతో వీరి రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నాయి. వీరికి భారత జట్టులో చోటు లేదని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.