Ranji Trophy 2025: 3 పరుగులకే రోహిత్ ఔట్.. స్టేడియం వదిలి వెళ్లిన ఫ్యాన్స్

Ranji Trophy 2025: 3 పరుగులకే రోహిత్ ఔట్.. స్టేడియం వదిలి వెళ్లిన ఫ్యాన్స్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. గురువారం (ఫిబ్రవరి 23) జమ్మూ కాశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. ఆట ఆరంభం నుంచి క్రీజ్ లో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డ హిట్ మ్యాన్.. 19 బంతులు ఎదుర్కొని లాంగాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని డిఫెన్స్ చేయడంలో హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. దీంతో దాదాపు దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టిన రోహిత్ సింగిల్ డిజిట్ కే వెనుదిరగాల్సి వచ్చింది. 

రోహిత్ శర్మ ఔట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. సొంతగడ్డపై రోహిత్ బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే తొలి అరగంటలోనే పెవిలియన్ కు చేరాడు. దీంతో అభిమానులు హిట్ మ్యాన్ వికెట్ అనంతరం గ్రౌండ్ వదిలి పోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడుతుండడంతో ముంబైలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచారు. దానికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి భారీ సంఖ్యలో వచ్చారు. అయితే రోహిత్ ఔట్ కావడంతో స్టేడియం ఖాళీగా మారింది. 

ALSO READ : ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్ లేపిన బుమ్రా

ఏడాది కాలంగా రోహిత్ టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు.. కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ ప్రదర్శన బీసీసీఐకి అసలు నచ్చలేదు. మూడు టెస్టుల్లో 10.93 యావరేజ్ తో వరుసగా 3,9,10,3,6 పరుగులు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌కు కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ చివరిసారిగా ముంబై జట్టుతో 2015లో ఉత్తరప్రదేశ్‌పై రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విఫమలైతే టెస్ట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.