రాజ్ కోట్ టెస్టులో టీమిండియా టాపార్డర్ బ్యాటర్ శుభమన్ గిల్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 91 పరుగులు చేసి భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ ఇన్నింగ్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క చెత్త షాట్ ఆడకుండా ఎంతో సహనంగా బ్యాటింగ్ చేసిన గిల్.. అనూహ్యంగా రనౌటయ్యాడు. ఖచ్చితంగా సెంచరీ చేస్తాడనుకుంటే రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. అయితే ఇప్పుడు గిల్ పై నెటిజన్స్ సానుభూతి చూపిస్తున్నారు. సెల్ఫ్ లెస్ నాక్ అని కొనియాడుతున్నారు. మరోవైపు రనౌట్ కారణమైన కుల్దీప్ యాదవ్ పై మంది పడుతున్నారు.
టామ్ హార్ట్లీ వేసిన ఇన్నింగ్స్ 64వ ఓవర్ చివరి బంతిని కుల్దీప్ యాదవ్ మిడ్-ఆన్ మీదుగా ఆడాడు. బంతి దూరంగా వెళ్లడంతో సింగిల్ కోసం గిల్ కు కాల్ ఇచ్చి రెండు అడుగులు వేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న గిల్.. అప్పటికే క్రీజ్ ధాటి వచ్చేశాడు. స్టోక్స్ అద్భుత ఫీల్డింగ్ ను గమనించిన కుల్దీప్ గిల్ ను వెనక్కి వెళ్ళమని చెప్పాడు. అయితే అప్పటికే స్టోక్స్ బంతిని వేగంగా బౌలర్ హార్టిలి వైపు విసరగా రనౌట్ చేశాడు. డైవ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 91 పరుగుల వద్ద గిల్ రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది.
ఇన్నింగ్స్ అంతా ఎంతో బాగా ఆడి ఇలా రనౌట్ రూపంలో అవుట్ అవ్వడం.. అది కూడా కుల్దీప్ యాదవ్ లాంటి నైట్ వాచ్ మెన్ కోసం తన వికెట్ ను త్యాగం చేయడంతో గిల్ ని సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. కుల్దీప్ యాదవ్ తన వికెట్ త్యాగం చేస్తే బాగుండు అని కొంతమంది అంటుంటే.. నైట్ వాచ్ మెన్ గా వచ్చి గిల్ ను వెనక్కి పంపించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ డబుల్(214) సెంచరీతో ఇంగ్లాండ్ ముందు భారత్ 557 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Kuldeep Yadav, a night watchman, refusing to run at the other end & sacrificing Shubhman Gill in his 90s has to be most hilarious thing this morning.
— Gabbar (@GabbbarSingh) February 18, 2024
This level of Self preservation shows insecurity in the team, as if their places are not secure & nobody wants to give an inch.