Cricket World Cup 2023: అందుకే కోహ్లీని "కింగ్' అన్నారు: విరాట్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటలోనే కింగ్ అనుకుంటే పొరపాటే. వ్యక్తిత్వంలోనూ ఈ పరుగుల వీరుడు రారాజే. తన ఆటతో 'కింగ్" అనే ట్యాగ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా తన గొప్ప మనసుని ఇప్పటికీ ఎన్నో సార్లు చాటుకున్నాడు. తాజాగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచులో తన శత్రువు నవీన్ ఉల్ హక్ పై చూపించిన ఔదార్యం ఫ్యాన్స్ ని మాత్రమే అందరిని ఫిదా చేసింది. 
   
IPL 2023 సందర్భంగా విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడడం ఇదే తొలిసారి. అయితే వీరిద్దరి మధ్య జరిగిన గొడవను విరాట్ ఫ్యాన్స్ సీరియస్ గా  తీసుకున్నారు. నవీన్ ఎక్కడకి వెళ్లినా..అతన్ని టార్గెట్ చేసి కోహ్లీ జపం చేశారు. ఈ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన తొలి మ్యాచులో నవీన్ కోహ్లీ ఫ్యాన్స్ చేతిలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 

తాజాగా నిన్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ ఢిల్లీలో జరగడం.. విరాట్ కోహ్లీకి ఇది హోమ్ గ్రౌండ్ కావడంతో ఫ్యాన్స్ ని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. నవీన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ కి దిగినప్పుడు కోహ్లీ కోహ్లీ అంటూ కేకలు పెట్టారు. అయితే ఇది చూసిన విరాట్.. నవీన్ పై ట్రోల్స్ చేయొద్దని.. సైలెంట్ గా ఉండాలని సూచించాడు. కోహ్లీ ఇలా చెప్పడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అనవసరంగా తనపై గొడవ పడిన నవీన్ పై కోహ్లీ చాలా పాజిటీవ్ గా స్పందించాడు. దీంతో కోహ్లీపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. మా కింగ్ వ్యక్తిత్వంలోనూ అందనంత ఎత్తులో నిలిచాడని చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ ఫ్యాన్స్ సైలెంట్ కావడంతో విరాట్ దగ్గరకు నవీన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కోహ్లీ కూడా నవ్వుతూ నవీన్ తో నవ్వుతూ మాట్లాడాడు. దీంతో గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న వీరిద్దరికి మధ్య వార్ కి నేడు ఎండ్ కార్డు పడింది. ఇక ఈ మ్యాచులో బ్యాటింగ్ తో కూడా రాణించిన విరాట్ హాఫ్ సెంచరీ చేసాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులో సెంచరీ చేయడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.