వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఆ దేశ క్రికెట్ బోర్డు కెప్టెన్ నుంచి సెలక్టర్ వరకు మొత్తం స్టాఫ్ ను మార్చేసింది. బాబర్ అజామ్ తనకు తానుగా కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయగా, సెలక్టర్, డైరెక్టర్ గా తొలగించి కొత్తవాళ్ళని ఎంపిక చేసింది. హఫీజ్ ను డైరెక్టర్ గా, మాజీ పేసర్ వాహాబ్ రియాజ్ ను సెలక్టర్ ఎంపిక చేసింది. ఇక పరిమిత ఓవరాల్ కెప్టెన్ గా షాహీన్ ఆఫ్రిదిని నియమించగా, టెస్టుల్లో షాన్ మసూద్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం పాక్ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో భాగంగా తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా జట్టుకు బాబర్ అజామ్ సహాయం చేయాలని చూసాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ బాబర్ అజామ్ ఏం చేసాడో ఇప్పుడు చూద్దాం. ఇన్నింగ్స్ 37 ఓవర్లో ఆస్ట్రేలియా బౌలర్ వెబ్ స్టర్ మొదటి బంతిని వేయగా.. ఈ బంతిని షాన్ మసూద్ లాంగాఫ్ మీదుగా ఆడాడు. షాన్ కొట్టిన ఈ బంతి బాబర్ అజామ్ పక్కన నుండి వెళ్తుండగా బాబర్ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ బంతి కాస్త దూరంగా వెళ్ళింది.
బాబర్ ఇలా ఎందుకు చేసాడో ఎవరికీ అర్ధం కావట్లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ కదా సరదాగా చేసి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటే నెటిజన్స్ మాత్రం బాబర్ ను ట్రోల్ చేసే పనిలో ఉన్నారు. బాబర్ ఆస్ట్రేలియా కు హెల్ప్ చేసాడని కొందరు కామెంట్ చేస్తుంటే, కెప్టెన్సీ పోయిన కోపంలో షాన్ మసూద్ ను బలి చేయాలనుకున్నాడని ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో షాన్ మసూద్ 156 పరుగులతో అజేయంగా నిలిస్తే.. బాబర్ అజామ్ 40 పరుగులు చేసాడు.
Babar Azam keeping himself in the game at the non-striker's end.... #PMXIvPAK pic.twitter.com/bMZk2Nk7pi
— cricket.com.au (@cricketcomau) December 6, 2023