ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదిహేనేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తుతారని అంతా అనుకున్నారు. కానీ, మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మ్యాచ్ చూసేందుకు రాలేదనే కథనాలు వస్తున్నాయి.
దాయాది పాకిస్తాన్‌లో బాంబుల మోత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ విదితమే. ఆఖరికి పిల్లలు చదువుకునే స్కూళ్లు, ప్రార్తనా మందిరాలను కూడా వదలరు.. ఉన్మాదులు. ఈ క్రమంలో పాక్- నేపాల్ మ్యాచ్ జరుగుతోన్న ముల్తాన్ స్టేడియం ఖాళీగా దర్శనమివ్వటం.. పలు ఊహాగానాలకు కారణమవుతోంది. దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చిన్న జట్టుతో మ్యాచ్ కావటం అందుకు ప్రధాన కారణాలైనా.. బాంబుల భయంతో ప్రేక్షకులు ముల్తాన్ స్టేడియానికి రాలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ స్టేడియం సామర్థ్యం 30వేలు కాగా, 13వేల మంది హాజరైనట్లు సమాచారం. దీంతో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శమిస్తున్నాయి.
ALSO READ :Nepal vs Pak: నేపాల్ కెప్టెన్ మెరుపు త్రో.. కళ్లు తేలేసిన పాక్ బ్యాటర్
A complete empty Stadium in Multan.
— the DUGOUT ! (@teams_dream) August 30, 2023
And They wanted to host full asia Cup in Pakistan
They Were Saying To boycott Asia Cup And World Cup
Shame On Pani Fans #AsiaCup23 #PAKvsNEP #WorldCup2023 #dhoni #SachinTendulkar #ViratKohli? #msdhoni pic.twitter.com/fdtPjwihht
Almost 90% stadium is empty in Pakistan’s opening Asia Cup match against Nepal ?? pic.twitter.com/7txgw331eS
— King Virat Kohli (@kingviratfan18) August 30, 2023
కెమెరామెన్ల కనుసన్నల్లో అందమైన భామలు
మ్యాచ్ చూసేందుకు వచ్చింది తక్కువ మందే కావడంతో కెమెరామెన్ల కళ్లన్నీ అందమైన అమ్మాయిలపైనే పడ్డాయి. మ్యాచ్ చూపించడం మానేసి.. వారినే నిమిషాల పాటు స్క్రీన్లపై చూపెడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Super man Muhammad Rizwan "/...???
— Silky Sport (@silkysportslive) August 30, 2023
Watch live matches on https://t.co/49pdFre5Xj#AsiaCup2023 #AsiaCup23 #CricketTwitter? #Rizwan #MultanCricketStadium pic.twitter.com/lo0CKybeiR