KKR vs GT: 23 కోట్లు తీసుకున్న మోసగాడు.. కేకేఆర్ ఆల్ రౌండర్‌పై ఫ్యాన్స్ ఫైర్

KKR vs GT: 23 కోట్లు తీసుకున్న మోసగాడు.. కేకేఆర్ ఆల్ రౌండర్‌పై ఫ్యాన్స్ ఫైర్

కోల్‌కతా నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ 2025 లో తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో 6 మ్యాచ్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. జట్టు విజయాలు సాధిస్తుంటే ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శన ఎవరూ పట్టించుకోరు. కానీ ఓడిపోతే విమర్శలు తప్పవు. వెంకటేష్ అయ్యర్ అయ్యర్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్ ల్లో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ముఖ్యంగా అతను గుజరాత్ టైటాన్స్ పై ఆడిన ఇన్నింగ్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.    

ఐపీఎల్ 2025 లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 21) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో  ఆతిధ్య కేకేఆర్ ను చిత్తు చేస్తూ 39 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చూస్తే సగటు క్రికెట్ అభిమానికి కోపం రాకుండా ఉండదు. నరైన్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అయ్యర్ పరుగులు చేయడానికి తడబడ్డాడు. ఎంత ప్రయత్నించినా ఈ కేకేఆర్ బ్యాటర్ కు ఒక్క షాట్ కూడా కనెక్ట్ అవ్వలేదు. మొత్తం 19 బంతుల్లో 73.68 స్ట్రైక్ రేట్‌తో 14 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

►ALSO READ | RR: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ సీరియస్.. జయ్దీప్ బిహానీపై చర్యలకు డిమాండ్

ఓ వైపు 199 పరుగుల భారీ లక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తున్నా.. అయ్యర్ పూర్తిగా సింగిల్స్ కే పరిమితమయ్యాడు. చివరికి ఒక భారీ షాట్ కు ప్రయత్నించి సాయి కిషోర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయ్యర్ బ్యాటింగ్ ప్రదర్శనపై ఇప్పుడు ఫ్యాన్స్ ఓ రేంజు లో ఫైరవుతున్నారు. కొంతమంది రూ. 23.75 కోట్ల రూపాయలు తీసుకున్న మోసగాడు అంటుంటే.. మరికొందరు మెగా ఆక్షన్ లో అయ్యర్ ను కొన్నప్పుడే కేకేఆర్ ఓడిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. కేకేఆర్ మెగా ఆక్షన్ లో అనవసరంగా 23కోట్లు చెల్లించిందని మండిపడుతున్నారు. కెప్టెన్ అజింక్య రహానే ఎంతో బెటర్ అని.. అయ్యర్ మాత్రం ఓవరేటేడ్ అని ఫైరవుతున్నారు.    

ఈ సీజన్ లో కోల్‌కతా మరో 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో 5 మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 3 మాత్రమే గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మ్యాచ్ ల్లో వెంకటేష్ అయ్యర్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ లో అదరగొట్టిన గిల్ సేన.. తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి ఈ సీజన్ లో ఆరో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  159 పరుగులు మాత్రమే చేయగలిగింది.