క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో కోహ్లీని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంటే మైదానంలో వేగంగా కదలటమే కాదు.. తన ఫిట్‌నెస్ లెవెల్స్ తో క్రీడా ప్రపంచాన్నే ఏలొచ్చు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అదే చేస్తుంటారు. ఎప్పటికప్పుడు తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానులు ఉత్సాహ పరుస్తుంటారు. కోహ్లీ చేసే చేసే ఈ పని.. ఇతర ఆటగాళ్లను ట్రోలింగ్‌కు గురిచేస్తోంది.
ఓ క్రికెట్ అభిమాని.. కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్‌తో పాక్ క్రికెటర్‌ని పోలుస్తూ ఓ పోస్ట్ క్రియేట్ చేశారు. దీని ఉద్దేశ్యం కోహ్లీ 34 ఏళ్ల వయస్సులోనూ యవ్వనంలో ఉంటే.. పాక్ క్రికెటర్ 32 ఏళ్లకే వయసు పైబడినట్లుగా ఉన్నాడని అర్థం. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. ఇఫ్తికార్ అహ్మద్. పాక్ జట్టులో అతను అత్యంత కీలక ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని కించపరుస్తూ కోహ్లీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
'కోహ్లీ కింగ్..' అంటూ కొందరూ, 'కింగ్ ముందు ఇఫ్తికార్ బచ్చా..' అంటూ మరికొందరు అతనిని కించపరుస్తున్నారు. ఒక అంతర్జాతీయ ఆటగాడిని ఈ విధంగా కించపరచటం సరిదికాదని ఇంకొందరు తమ వాదాన్ని వినిపిస్తున్నారు. ఈ పోస్ట్‌పై పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.