
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ హాకీ టీమ్ ప్లేయర్ వందన కటారియా 15 ఏండ్ల కెరీర్‌కు మంగళవారం (April 1) గుడ్‌బై చెప్పింది. 320 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 158 గోల్స్ చేసిన 32 ఏండ్ల వందన ఇండియన్ విమెన్స్ హాకీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
‘ఈ రోజు బరువైన హృదయంతో ఇంటర్నేషనల్ హాకీకి వీడ్కోలు పలుకుతున్నా. నాలో హాకీ ఆడాలన్న కోరిక ఇంకా మిగిలే ఉంది. కానీ ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. అత్యున్నత దశలో ఉన్నప్పుడే వీడ్కోలు చెబుతున్నా’ అని వందన పేర్కొంది. 2009లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో టీమ్ నాలుగో ప్లేస్‌లో నిలవడంలో కీలక పాత్ర పోషించింది.