
సాధారణంగా సెలబ్రెటీలని, స్టార్స్ ని చాలా మంది ఇష్టపడతారు. వారి కోసం ఎం చేయడానికైనా సిద్ధపడతారు. కొందరు తెగించి వారికి తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు కూడా. అలాంటి సంఘటనే నటి ఫరినా ఆజాద్(Farina Azad) కి ఎదురైందట. ఇదే విషయం గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి తన చాలా వింతగా ప్రపోజ్ చేశాడట. ఆ సంఘటనను జీవితంలో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది ఫరినా.
ఇంతకీ అసలు విషయం.. తమిళ ఇండస్ట్రీలో ఒరు మిన్ ప్లీజ్ అనే షోతో మొదటగా యాంకర్ గా పరిచయమైన ఫరినా.. కొంతకాలానికి నటిగా మారింది. ఆమె నటించిన భారతి కన్నమ్మ సీరియల్ తో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ సీరియల్ దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు టెలికాస్ట్ అవడం విశేషం. అయితే.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా యాంకర్ ఫరినాకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి అడగగా.. తనకు వచ్చిన వింత ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.
అదేంటంటే.. కొన్నేళ్ల క్రితం ఒక అబ్బాయి తనను ప్రేమిస్తున్నాను అంటూ ఫరినా వెంటపడ్డాడట. అతని నుండి తప్పించుకోవడానికి.. మేము ముస్లిమ్స్ నువ్వు కాదు కాబట్టి మా ఇంట్లో మన ప్రేమకు అంగీకారం లభించదు అని చెప్పిందట. దానికి ఆ అబ్బాయి ముస్లిం పురుషులు చేయించుకునే సున్తీ చేయించుకోవడానికి సిద్ధం అయ్యాడట. ఆ సంఘటన లైఫ్ లో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు ఫరినా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవగా దానిపై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కాస్త లేట్ అయితే ఉప్పెన సీన్ రిపీట్ అయ్యేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.