మెసేజ్​లు వస్తున్నా డబ్బులు జమ కావట్లే: జీకే ఈదన్న

అలంపూర్, వెలుగు: రుణమాఫీ అయినట్లు మెసేజ్​లు వస్తున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లింగనవాయి గ్రామంలో రైతు వేదిక వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. 

ALSO READ : మానవపాడు ఇండ్ల స్థలాల కోసం వినతి: లక్ష్మీదేవి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై వ్యవసాయ, బ్యాంకు, ప్రభుత్వ అధికారులు మాట్లాడడం లేదన్నారు. వెంటనే రుణమాఫీ డబ్బులు జమ అయ్యేలా చూడాలని లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వేమారెడ్డి, నల్లగాసుల జయరాముడు, రాంపోగు ఆంజనేయులు, రామేశ్వర్ రెడ్డి, గౌస్, పీరా, ఈశ్వర్  ఉన్నారు.