ఇయ్యాల భారత్ బంద్

ఇయ్యాల భారత్ బంద్

అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు

పంజాబ్‌లో మొదలైన రైల్ రోకో
రైళ్లను రద్దు చేసిన అధికారులు

చండీగఢ్/న్యూఢిల్లీ: పార్లమెంట్ పాస్ చేసిన అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనను తీవ్రం చేశాయి. ఆలిండియా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి చాలా రాష్ట్రాల్లోని రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలిపాయి. పంజాబ్, హర్యానాల్లో 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఇప్పటికే నిరసనలు చేస్తున్నారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ లో గురువారం మూడ్రోజుల రైల్ రోకోను ప్రారంభించారు. అమృత్ సర్, ఫిరోజ్ పూర్ లలో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. రైతుల నిరసనతో ఫిరోజ్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్లను నిలిపివేశారు. ఈ నెల 24 నుంచి 26 వరకు 14 జతల రైళ్లను బంద్‌జేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రైల్ రోకోతో ఆహార ధాన్యాలు, వస్తువుల రవాణాఫై ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులందరూ రైతుల నిరసనకు మద్దతు తెలపాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రెసిడెంట్ సత్నం సింగ్ పన్ను కోరారు. అగ్రి బిల్లులకు అనుకూలంగా ఓటేసిన వారిని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ అగ్రి బిల్లులను ఆమోదించవద్దని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని తిరిగి పార్లమెంట్ కు పంపాలని కోరుతున్నాయి. మూడు అగ్రి బిల్లులకు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. బిల్లులతో రైతులకు నష్టం కలుగుతుందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ..

అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ గురువారం నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, 2కోట్ల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది.

కాంగ్రెస్‌‌‌‌ది డబుల్ గేమ్

అగ్రి బిల్లులపై కాంగ్రెస్ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని, ‘‘డబుల్ ఫేస్డ్’’ పాలిటిక్స్ చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రి బిల్లులను వ్యతిరేకించాలనుకుంటే, ముందుగా 2019లో ఆ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలన్నారు. కాంగ్రెస్ అప్పుడొకటి చెప్పి, ఇప్పుడొకటి చేస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్రం తెస్తున్న చట్టాలతో రైతులకు నష్టం ఉండదని, మద్దతు ధర యథాతథంగా కొనసాగుతుందన్నారు.

For More News..

మీకు నిజంగా అంత వయసుందా?

పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అంత ఈజీ కాదు