వనపర్తి .. ప్రజావాణికి వచ్చి రైతు సూసైడ్‌‌‌‌ అటెంప్ట్‌‌‌‌

వనపర్తి .. ప్రజావాణికి వచ్చి రైతు సూసైడ్‌‌‌‌ అటెంప్ట్‌‌‌‌
  • అర్జీ ఇచ్చేందుకు వెళ్తుండగా పేపర్లు లాక్కుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు
  • వనపర్తి కలెక్టరేట్‌‌‌‌లో ఘటన

వనపర్తి, వెలుగు : తన భూమి సమస్య పరిష్కారం కాకపోగా, కలెక్టర్‌‌‌‌ను కలిసేందుకు ప్రజావాణికి వస్తే కొందరు వ్యక్తులు పేపర్లు లాక్కుపోయారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం వనపర్తి కలెక్టరేట్‌‌‌‌ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వనపర్తి జిల్లా గోపాల్‌‌‌‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే రైతు సోమవారం వనపర్తి కలెక్టరేట్‌‌‌‌కు వచ్చాడు. కలెక్టర్‌‌‌‌ను కలిసేందుకు ప్రజావాణి జరుగుతున్న హాల్‌‌‌‌లోకి వెళ్లబోతుండగా కొందరు వ్యక్తులు వచ్చి సాయిరెడ్డి చేతిలోని పేపర్లను లాక్కుపోయారు.

 దీంతో పంటకు కొట్టే మందును నీళ్లలో కలుపుకొని తాగాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వెంకటేశ్వర్లుకు సమాచారమిచ్చారు. తర్వాడ సాయిరెడ్డిని హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. తనకు ఏదుట్ల గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉందని, దానిని దున్నకుండా తన అన్న, అతడి కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ విషయంపై గోపాల్‌‌‌‌పేట పోలీసులు, తహసీల్దార్‌‌‌‌కు ఫిర్యాదు చేశానని, ఒకసారి ప్రజావాణిలోకి కూడా అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజావాణికి రాగా అర్జీ ఇవ్వకుండా పేపర్లు లాక్కుపోయారన్నారు. ఆఫీసర్లు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.