ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

వరుసగా రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మిర్చి మార్కెట్​ కు పెద్దయెత్తున పంటను రైతులు తీసుకువచ్చారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాలతో పాటు ఏపీలోని జిల్లాల నుంచి కూడా మార్కెట్​ కు వచ్చింది. సోమవారం జెండా పాటను రూ.21వేలుగా నిర్ణయించినా, క్వింటాకు రూ.14 వేలకు మించి రైతులకు దక్కడం లేదు.

 - ఖమ్మం, వెలుగు