దుబ్బాకలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

దుబ్బాకలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

దుబ్బాక, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్ది మండలం మోతే గ్రామానికి చెందిన మోటి మల్లయ్య (48) తనకున్న ఎకరా 20 గంటల భూమిలో రెండు బోర్లు వేశాడు. చుక్క నీరు రాలేదు. 

వేసిన బోర్లకు చేసిన అప్పులు, గతంలో వ్యవసాయానికి చేసిన అప్పులు కలిపి రూ . 8 లక్షలు అయ్యాయి.  అప్పుల బాధలు అధికమవడంతో మల్లయ్య ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.