అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో ఘటన
దుబ్బాక, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం దుంపలపల్లి గ్రామానికి చెందిన కుక్కల భిక్షపతి(45) రూ. 5 లక్షలు అప్పు చేసి ఇటీవల ఇంటి నిర్మాణం, ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. యాసంగిలో వడగండ్ల వానతో రెండెకరాల వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ట్రాక్టర్‌‌‌‌కు కిస్తీలు కట్టలేకపోయాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. అటు అప్పులు ఇటు వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఆదివారం తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.